Tuesday, November 4, 2008

నందమూరి తారక రామారావు (జూనియర్ )





తారక్ ఫొటోస్ కావాలంటే కింద క్లిక్ చెయ్యండి
http://picasaweb.google.com/jagadishyalla125/NTR#

తారక్ లేదా ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు అదె పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినీమా నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు మనుమడు. ఇతను మే 20, 1983న జన్మించాడు. ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని.

చిన్నతనములో కూచిపూడి నాట్యం వేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతను "తారక్" లేదా "ఎన్.టి.ఆర్." గా పిలువబడాలని కోరుకుంటాడు. మన దేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు.

చిత్ర రంగంలో
ఇతని తాతగారు, తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రం అంతగా ఆడకపోయినా ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు.ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాదించాడు. ఆ చిత్రం విజయవంతమవడం తో విరివిగా అవకాశాలు రాసాగాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు నిరాశ పరిచింది. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడడలేదు. ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం తో అతను అగ్ర నటులలొ ఒకనిగా ఎదిగాడు.

ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతన్ని వరుసగా పరాజయాలు పలకరించాయి. బాగా లావయ్యడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. రాఖీ చిత్రం ఒకమాదిరిగా ఆడింది కాని అందులో అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది. ఇలా నాలుగు సంవత్సరాలు అతను విజయం కోసం అలమటించాడు.


2007 లో గత చిత్రాలు "స్టూడెంట్ నెం.1", "సింహాద్రి"ల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం లో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి లావవుతున్నాడన్న విమర్శలను తిప్పి కొట్టాడు.

2008 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో "కంత్రీ" అనే చిత్రం vijayam sadhinchindi
.


2008 కంత్రీ క్రాంతి
2007 యమదొంగ రాజా
2006 రాఖీ రామకృష్ణ / రాఖీ
2006 అశోక్ అశోక్
2005 నరసింహుడు నరసింహుడు
2005 నా అల్లుడు కార్తీక్, మురుగన్
2004 సాంబ సాంబ శివనాయుడు
2004 ఆంధ్రావాలా శంకర్ పహల్వాన్, మున్న
2003 సింహాద్రి సింహాద్రి Winner Santosham Best Young Performer Award
2003 నాగ నాగ
2002 అల్లరి రాముడు రామ కృష్ణ
2002 ఆది ఆది కేశవ రెడ్డి
2001 సుబ్బు సుబ్బు
2001 స్టూడెంట్ నెం.1
2001 నిన్ను చూడాలని తెరంగేట్రం
1996 బాల రామాయణము రాముడు బాల రామాయణము
బ్రహ్మర్షి విశ్వామిత్ర బాలనటుడు

No comments: